Liquor sales: మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ది ఎలా ఉందనే విషయంలో బేధాభిప్రాయాలున్నా...మందు అమ్మకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయమే. మస్తుగా అమ్మకాలయ్యాయి. నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. 
  • Dec 03, 2020, 11:51 AM IST

Liquor sales: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ది ఎలా ఉందనే విషయంలో బేధాభిప్రాయాలున్నా...మందు అమ్మకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయమే. మస్తుగా అమ్మకాలయ్యాయి. నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. 

1 /6

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ది ఎలా ఉందనే విషయంలో బేధాభిప్రాయాలున్నా...మందు అమ్మకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయమే. మస్తుగా అమ్మకాలయ్యాయి.

2 /6

నవంబర్ 26న 229 కోట్లు, 27వ తేదీన 346 కోట్లు, 28వ తేదీన 284 కోట్ల మద్యం అమ్ముడైందంటే..అదంతా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావమేనని తెలుస్తోంది. 

3 /6

నవంబర్ నెలలో అమ్ముడైన లిక్కర్ కేసుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా 31 లక్షల లిక్కర్ కేసుల మందు తాగారట.

4 /6

మొత్తం నవంబర్ అమ్మకాలు 2 వేల 567 కోట్లైతే...మూడ్రోజుల్లో అంటే 26,27,28 తేదీల్లోనే 860 కోట్ల మద్యం అమ్ముడైంది.

5 /6

ఎన్నికల పుణ్యమా అని సేల్స్ బాాగా పెరిగాయని కొందరంటున్నారు. నవంబర్ నెలలో 31 లక్షల 60 వేల 135 లిక్కర్ కేసులు లాగించేేశారట తెలంగాణలో. ఇక బీర్ల విషయంలో నవంబర్ నెలలో 23 లక్షల 85 వేల 597 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. 

6 /6

సాధారణంగా నెలకు 17 వందల కోట్ల అమ్మకాలుండేవి. కానీ నవంబర్ నెలలో మాత్రం 2 వేల 567 కోట్ల మద్యం అమ్ముడైంది.